పెద్దపల్లి: మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం ముఖ్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్స్టేషన్లో సీఐ రమేశ్, ఎస్సై అనూష మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజన్ తప్పర్ మెక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బల్క సమన్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ డాక్టర్ అనిల్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- June 25, 2020
- Archive
- తెలంగాణ
- HARITHAHARAM
- MINISTER
- PEDDAPALLY
- PLANTS
- చందర్
- రామగుండం
- Comments Off on నాటిన మొక్కలను రక్షిద్దాం