సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందు పనిచేసిన కలెక్టర్ ఈ.శ్రీధర్‌ను బదిలీచేసిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా కలెక్టర్ యాష్మిన్బాషాకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాజాగా శ్రీధర్‌ను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించారు. అయితే నూతనంగా నియమితులైన కలెక్టర్ ఎల్.శర్మన్ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు శర్మన్ గతంలో నాగర్‌కర్నూల్ ఆర్డీవోగానూ పనిచేశారు.
- July 15, 2020
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- COLLECTOR
- NAGARKURNOOL
- SHARAMAN
- ఎల్.శర్మన్
- కలెక్టర్
- నాగర్‌కర్నూల్
- Comments Off on నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా ఎల్.శర్మన్