సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో బుధవారం 43 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ ఎలిజిబెత్ రాణి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పాజిటివ్వచ్చినవారు అధైర్యపడొద్దని సూచించారు. మెడికల్ టెస్టులు నిర్వహించిన వారిలో ఏఎన్ఎం రేణుక, ఆశావర్కర్లు సంతోష, రేఖ, పుష్ప, మమత పాల్గొన్నారు.
- November 11, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CARONA TESTS
- medak
- NIZAMPEY
- RAMAYAMPET
- కరోనా టెస్టులు
- నిజాంపేట
- మెదక్
- రామాయంపేట
- Comments Off on నస్కల్ లో కరోనా టెస్టులు