బాలీవుడ్ హీరోలు పలువురు ఓటీటీ బాటపడుతుండగా..సౌత్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో మూవీ కూడా ఓటీటీ విడుదలకు సిద్ధంగా లేరు. ఇదే సమయంలో తెలుగు.. తమిళ హీరోలు వెబ్ సిరీస్ ల్లో నటించడం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడం అన్నట్లుగా అభిప్రాయంలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోలు పలువురు వెబ్ సిరీస్ లు చేస్తుంటే ఇప్పటి వరకు ఎవరు కూడా సౌత్ హీరోలు వెబ్ సిరీస్ లకు ముందుకు రాలేదు. మొదటి సారి సూర్య వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మణిరత్నం నిర్మాణంలో ‘నవరస’ అనే విభిన్నమైన వెబ్ సిరీస్ రూపొందబోతుందట. ఈ సినిమాకు పలువురు దర్శకులుగా వ్యవహరించబోతున్నారు. ఆ వెబ్ సిరీస్ లో కీలక పాత్రను సూర్య పోషించేందుకు ఓకే చెప్పాడట. ‘నవరస’ కాన్సెప్ట్ నచ్చడంతో ఓటీటీ ఎంట్రీకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. ఇది నిజమైతే సూర్య ఓటీటీ ఎంట్రీ తెర తీసేందుకు డేర్ చేశాడన్న మాటే అంటున్నారు.
- July 15, 2020
- Archive
- Top News
- సినిమా
- OTT
- SURYA
- WEB SERIES
- ఓటీటీ
- మణిరత్నం
- సూర్య
- Comments Off on ‘నవరస’ సిరీస్లో స్టార్ హీరో