సారథిన్యూస్, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.
తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చనవారిలో పోలీస్, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.