Breaking News

‘ధరణి’ పనితీరు అద్భుతం

‘ధరణి’ పనితీరు అద్భుతం

సారథి న్యూస్, హైదరాబాద్: ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందని, మరో మూడు నాలుగు రోజుల్లో నూటికి నూరు శాతం అన్నిరకాల సమస్యలను అధిగమించనుందని సీఎం కె.చంద్రశేఖర్​రావు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ​ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆధారణ పొందనుంది. అద్భుతమైన ప్రతిపాదన వస్తోంది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్లుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాంక్ అద్భుతంగా ఉంది. అందుకే కొన్ని రోజులు వేచిచూసినం. నవంబర్ 23న సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ ను అద్భుతంగా తీర్చిదిద్దన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని సీఎం అన్నారు. సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.