సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి సతీమణి సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి సహా 23 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. రాజకీయ కారణాలతో రాని ఉపఎన్నికల్లో హడావుడి తక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి దుబ్బాక ఎన్నికలు తెలంగాణలో బాగా వేడి పుట్టించింది.
మొరాయించిన ఈవీఎంలు
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో అరగంట సేపు ఈవీఎం మొరాయించడంతో అధికారులు సరిచేశారు. చేగుంటలో పోలింగ్ స్టేషన్ ను సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డెవిస్ తనిఖీచేశారు. స్థానికేతరులు ఉంటే అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్థానిక పోలింగ్‌కేంద్రాలను టీఆర్ఎస్అభ్యర్థి సుజాత సందర్శించారు. భారీ మెజారిటీతో గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తంచేశారు. చేగుంట మండలంలోని వడియారం జడ్పీ హైస్కూలులో ఏర్పాటుచేసిన పోలింగ్సెంటర్ను చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు.
- November 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCE
- DUBBAKA
- HARISHRAO
- RAGHUNANDANRAO
- TELANGANA
- తెలంగాణ
- దుబ్బాక
- రఘునందన్‌రావు
- సిద్దిపేట
- సీఎం కేసీఆర్
- హరీశ్‌రావు
- Comments Off on దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్