చైతన్య తమ్హానే.. మరాఠీలో పేరున్న డైరెక్టర్. 2014లో ఆయన తీసిన ‘కోర్ట్’ అనే సినిమాతో చాలా ఫేమ్ సంపాదించాడు. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన చైతన్య ఇప్పుడు ఇండియాలోనే కాదు తను రీసెంట్గా తీసిన మూవీతో వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులు దక్కించుకుని వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ‘ది డిసైపుల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం ఒక యువ సంగీత దర్శకుడి సినీప్రయాణం.. జీవితంలో అతడుపడ్డ కష్టాలు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు. తన జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నదే కథనం. ఆ విషయాలను దర్శకుడు చైతన్య చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అందుకే ఈ సినిమాకు వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోటు దక్కించుకోవడంతో పాటు రెండు అవార్డులు కూడా వచ్చాయి.
ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుతో పాటు ఎఫ్ పీ ఆర్ఈఎస్ ఐ క్రిటిక్స్ విభాగంలో మరో అవార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ.. ‘ఈ కథ రాసుకోవడం కోసం పడ్డ కష్టం అంతాఇంతా కాదు. నేను పడ్డ కష్టానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు మరింతగా కష్టపడేందుకు ఈ సినిమాకు వచ్చిన అవార్డులే ప్రోత్సహంగా నిలుస్తాయి’ అని అంటున్నాడు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు.