డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్వరుణ్ తేజ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ లో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ భామ దిశా పటాని. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. తర్వాత దిశకు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో నేటివ్ అయిన బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ధోని’ చిత్రంలో సుషాంత్ సరసన నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి అక్కడ. దాంతో టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడడం మానేసింది. గతేడాది విడుదలైన ‘భారత్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జంటగా నటించి మంచి హిట్ అందుకుంది. కాగా, దిశ తాజాగా తనకు వచ్చిన ఓ భారీ ఆఫర్ ను వదులుకుందట. అది కూడా హాలీవుడ్ మూవీ ఆఫర్ అని సమాచారం. నేను బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తాను.. హాలీవుడ్ సినిమాలకు వెచ్చించేంత టైమ్ నాకు లేదు అంటోంది దిశ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తోనే మళ్లీ జోడీ కడుతోంది. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది దిశా పటాని.
- July 11, 2020
- Archive
- Top News
- సినిమా
- BOLLYWOOD
- DISHAPATANI
- SALMANKHAN
- దిశా పటాని
- వరుణ్ తేజ
- సల్మాన్‌ఖాన్
- Comments Off on ‘దిశ’ మారింది