సారథి న్యూస్, నల్లగొండ: అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సంతాప సభను ఆదివారం నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, శాసనసభ్యులు పైలా శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య యాదవ్, భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్రనాయక్, జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రాములునాయక్, వేముల వీరేశం, నోముల కుటుంబసభ్యులు లక్ష్మి, భగత్ తదితరులు హాజరయ్యారు.
- December 13, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ETALA RAJENDAR
- NAGARJUNASAGAR
- NALGONDA
- NOMULA NARSIHMAIAH
- ఈటల
- గుత్తా
- నల్లగొండ
- నాగార్జునసాగర్
- నోముల నర్సింహయ్య
- Comments Off on దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఘన నివాళి