సారథి న్యూస్, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా పైపైకి అందకుండాపోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,350 క్షీణించడంతో రూ. 54,680కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,010 తగ్గడంతో రూ.50,130కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.50 పెరగడంతో రూ.72,550కు చేరింది. ఇలా రెండు, మూడు రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. గోల్డ్ రేటు రూ.70వేలకు చేరుతుందని ఆర్థికరంగ నిపుణులు, విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ధరలు తగ్గుతుండడంతో బంగారు ఆభరణాలు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
- August 13, 2020
- Archive
- Top News
- జాతీయం
- GOLDRATE
- HYDERABAD
- TELANGANA
- తెలంగాణ
- బంగారం ధరలు
- హైదరాబాద్
- Comments Off on దిగొచ్చిన గోల్డ్ రేటు