సారథి న్యూస్, రామాయంపేట: కూలీలుగా ఉన్న దళితులు రైతులుగా ఎదగాలని, ఆత్మగౌరవంతో జీవించాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) రాష్ట్ర సమన్వయ కర్త పీ శంకర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో దళిత మహిళా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన మూడెకరాలు తీసుకున్న దళితులు ఆహార పంటలను పండించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీబీఅర్సీ మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ దుబాషి సంజీవ్, పరశురాములు, దేవరాజు, స్వామి, నవీన్, బుచ్చయ్య, లక్ష్మి, లలిత, బుధవ్వ, తిరుమలవ్వ దళిత రైతులు పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- DALITHS
- Farmers
- medak
- RAMAYAMPET
- దళితులు
- వ్యవసాయం
- Comments Off on దళితులు ఆత్మగౌరవంతో జీవించాలి