Breaking News

తొలి టీకా రష్యా నుంచే

మాస్కో: కరోనా టీకాపై గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. తామంటే, తాము వ్యాక్సిన్​ తీసుకొస్తామని ప్రపంచంలోని పలుదేశాలు, వ్యాక్సిన్​ తయారీ సంస్థలు ప్రకటనలు గుప్పించాయి. కాగా తాజాగా రష్యా ఓ అడుగు ముందుకేసి.. తాము క్లినికల్​ ట్రయల్స్​ కూడా పూర్తిచేశామని.. అతి త్వరలోనే వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. రష్యాకు చెందిన సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వాడిమ్‌ తారాసోవ్‌ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన టీకాతో జూన్ 18 న ట్రయల్స్ ప్రారంభించారు. అందులో భాగంగానే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల బృందం బుధవారం డిశ్చార్జ్‌ కానుంది. ఇక రెండో బృందం జూలై 20వ తేదీన డిశ్చార్జ్‌ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. రెండు బృందాలకు కూడా సెచెనోవ్‌ యూనివర్శిటీ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసినట్లు తారాసోవ్‌ చెప్పారు. ‘మేము ఈ టీకాతో పనిచేశాము. ట్రయల్స్‌లో ఈ దశ యొక్క లక్ష్యం మానవ ఆరోగ్యానికి వ్యాక్సిన్ యొక్క భద్రతను పరీక్షించడం, ఇది విజయవంతంగా జరిగింది’ అని సెచెనోవ్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్-బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ అన్నారు. చదవండి: