Breaking News

తేమ లేని వడ్లు తీసుకురండి

తేమ లేని వడ్లు తీసుకురండి

సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్​జిల్లా కలెక్టర్​ఎం.హనుమంతరావు సూచించారు. సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తయిందని, అయితే అకాల వర్షాలు కురవడంతో వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ ​హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోడ్డు పక్కన ధాన్యం ఎండబెట్టుకున్న సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పుస్తకాలు, పెన్నులతో కలవండి
మెదక్​ జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తనను కలిసే వారు బొకేలు, పూలతో కాకుండా పుస్తకాలు, పెన్నులతో రావాలని కలెక్టర్​ ఎం.హనుమంతరావు కోరారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. వాటిని పేద విద్యార్థులకు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్​ కోరారు.