సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్–2020 ను ఆమోదించింది. ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020ను ఆమోదించింది. అలాగే తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు-2019లోని సవరణ బిల్లుకు ఓకే చెప్పింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, గ్రామ పంచాయత్స్ ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు– 2018 సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే తెలంగాణ జీఎస్టీ యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది. టీఎస్ బిపాస్ బిల్లు ఆమోదం పొందింది. సమావేశంలో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యమైన నిర్ణయాలు
https://www.facebook.com/TelanganaCMO/videos/657389521842627
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020కు ఆమోదం.
ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ఆమోదం. - ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002కు ఆమోదం.
- ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్డినెన్స్ కు ఆమోదం.
- తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లును ఆమోదం.
ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లుకు ఆమోదం. - కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను ఆమోదం.
- కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు.
- 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదం.