సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని వివరించారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులను స్మరిస్తూ.. కాళేశ్వరం గోదావరి జలాలతో నివాళులు అర్పించారు. సమీకృత కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసి మాట్లాడారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఫలాలు సిద్దిపేటకు అందాయని చెప్పారు. సీఎం కేసీఆర్ దీక్షతో కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు.
- June 3, 2020
- Top News
- తెలంగాణ
- HARISH RAO
- TELANGANA
- ఆవిర్భావ దినోత్సవం
- కాళేశ్వరం
- గోదావరి
- Comments Off on తెలంగాణ ఫలాలు అందుతున్నాయ్