హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరిగే ఎంసెట్ కు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెప్టెంబర్3 నుంచి ఈనెల 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్సెంటర్లకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. రెండు రోజుల నుంచి జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలకు సైతం అదే తరహాలో ఏర్పాట్లు చేయనున్నారు. హాల్‌టికెట్ల డౌన్ లోడ్ కోసం www.eamcet.tsche.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలని జేఎన్టీయూ సూచించింది.