సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,906కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 43,751 మంది డిశ్చార్జ్ కాగా, 492 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 9,178 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి 30, హైదరాబాద్ 509, జగిత్యాల 12, జనగాం 13, భూపాలపల్లి 8, గద్వాల 22, కామారెడ్డి 10, కరీంనగర్ 93, ఖమ్మం 69, ఆసిఫాబాద్ 6, మహబూబ్ నగర్ 47, మహబూబాబాద్ 9, మంచిర్యాల 28, మెదక్ 23, మేడ్చల్ 158, ములుగు 17, నాగర్ కర్నూల్ 29, నల్లగొండ 51, నారాయణపేట 7, నిర్మల్ 8, నిజామాబాద్ 47, పెద్దపల్లి 44, సిరిసిల్ల 13, రంగారెడ్డి 147, సంగారెడ్డి 89, సిద్దిపేట 21, సూర్యాపేట 38, వికారాబాద్ 7, వనపర్తి 4, వరంగల్ రూరల్ 41, వరంగల్ అర్బన్ 138, యాదాద్రి 11 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.