Breaking News

తెలంగాణలో 2,216 కేసులు

తెలంగాణలో 2,216 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 961కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,24,528కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.

తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​