సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 1,763 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు 95,700 మంది కరోనా బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాబారిన పడి 719 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 1789 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 73,991కి చేరుకున్నది. రాష్ట్రంలో 20,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 7,97,470 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలో 484, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 169, రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్‌లో 88, నల్లగొండలో 65, కామారెడ్డిలో 63, జగిత్యాలలో 61, మంచిర్యాలలో 55, కరీంనగర్లో 53, , పెద్దపల్లిలో 46, నిజామాబాద్లో 45, ఖమ్మంలో 40, సిద్దిపేట37, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35, మహబూబ్‌నగర్‌లో 33, వరంగల్ రూరల్‌లో 31, జోగుళాంబ గద్వాలలో 30, సూర్యాపేటలో 20 చొప్పున కేసులు నమోదయ్యాయి.