Breaking News

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

తెలంగాణలో 1,478 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి వణికిస్తోంది. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో 1,478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తంగా 42,496 కేసులు నిర్ధారణ అయ్యాయి. వ్యాధి బారినపడి ఇప్పటివరకు 27,296 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 403 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 13,389 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 806, రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్​82, సంగారెడ్డి 18, కామారెడ్డి 31, వరంగల్​అర్బన్ 51, కరీంనగర్​77, పెద్దపల్లి 35, మెదక్, 23, మహబూబ్​నగర్​19, నల్లగొండ 35, సిరిసిల్ల 27, నాగర్​కర్నూల్​23, సూర్యాపేట 20, నిజామాబాద్​11, జనగామ జిల్లాలో 10 చొప్పున పాజిటివ్​కేసులు నమోదయ్యాయి.