సారథిన్యూస్, హైదరాబాద్; ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
- June 21, 2020
- Archive
- తెలంగాణ
- HYDERABAD
- ODISHA
- RAINS
- TELANGANA
- ఉపరితల ఆవర్తనం
- వర్షాలు
- Comments Off on తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు