Breaking News

తెలంగాణలో బంగారం పండిచొచ్చు

సారథి న్యూస్​, సూర్యాపేట: తెలంగాణ భూముల్లో బంగారు పండుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలకు కావలసిన ఆహార ఉత్పత్తులను పండించగల సామర్థ్యం ఇక్కడి భూములకు ఉందన్నారు. ఇక మిగిలింది పంటకు గిట్టుబాటు ధర కల్పించడమేనని ఆయన​న్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రుణమేళా సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్​ రూపొందించిన నియంత్రిత సాగులో రైతులను సంఘటితం చేయడమేనని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్. టీసీఎంఎస్ చైర్మన్ వంటే యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, సూర్యాపేట గరిమెళ్ల అన్నపూర్ణ పాల్గొన్నారు.