సారథి న్యూస్, వికారాబాద్: తాండూరులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొడంగల్– తాండూరు మధ్య ఉన్న కాగ్నా వంతెన తెగిపోయింది. వరద మధ్యలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జి తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురవడంతో తాండూరు నియోజకర్గంలోని పంట పొలాలు నీటమునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. కోట్ పల్లి ప్రాజెక్టు లోకి ఆరు అడుగుల వరద చేరింది. బుగ్గపూర్ కోట్ పల్లి, నర్సాపూర్ వాగులు ద్వారా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 10 అడుగుల నీటిమట్టం ఉంది.
- July 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- HEAVY RAIN
- TANDUR
- తాండూరు
- భారీవర్షం
- వికారాబాద్
- Comments Off on తాండూరులో భారీవర్షం