రీసెంట్గా ఓటీటీలో రిలీజైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మూవీలో ఓ కీలకపాత్ర పోషించింది సీరత్ కపూర్. ఆమె క్యారెక్టర్‌కు మంచి పేరు వచ్చింది. తన పాత్రల్లో గ్లామర్ ఏ మాత్రం తగ్గించని సీరత్ కపూర్ ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన సీరత్ ఆ తర్వాత వరుస గా ‘టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, ఒక్కక్షణం, టచ్ చేసి చూడు’ సినిమాల్లో నటించింది. ఎంత గ్లామర్ ఒలకబోసినా..ఇంప్రెసివ్‌గా నటించినా ఆఫర్లు మాత్రం అనుకున్నంతగా రాలేదు సీరత్ కి. అయితే ఓటీటీలో రిలీజైన ఈ సినిమా బజ్‌తో సీరత్ కెరీర్ స్పీడ్ అందుకోనుందేమో చూద్దాం. ప్రస్తుతం సీరత్ ‘మా వింత గాథ వినుమా’ సినిమాలో హీరోయిన్గా చేస్తోందట. ఈ చిత్రంలో తమిళ అమ్మాయిగా కనిపించనుందట. అంతేకాదు తన ఆశలన్నీ ఈ చిత్రం పైనే పెట్టుకున్నా అంటోంది. మరి సీరత్ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.
- July 7, 2020
- Archive
- సినిమా
- OTT
- SIRATHKAPOOR
- TOLLYWOOD
- కృష్ణ అండ్ హిజ్ లీల
- సీరత్‌కపూర్
- Comments Off on తమిళ అమ్మాయిగా సీరత్