సారథిన్యూస్, హైదరాబాద్: రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 39 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ సిబ్బందే.. ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతోసహా అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. హోటళ్లనుంచి పార్శిల్‌ను మాత్రం అనుమతించనున్నారు.
- June 15, 2020
- Archive
- తెలంగాణ
- CHENNAI
- HOTELS
- LOCKDOWN
- TAMILNADU
- తిరువళ్లూరు
- సంపూర్ణ లాక్డౌన్
- Comments Off on తమిళనాడులో మరోసారి లాక్డౌన్