ప్రముఖ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్వట్టర్లో వెల్లడించింది. ‘మా అమ్మా, నాన్న కొద్దిరోజులుగా కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంట్లో ఉన్న వారంతా టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు’. అని తమన్నా ట్విట్టర్ లో పేర్కొంది. కాగా, ముందుజాగ్రత్తగా తమన్నా కోసం హోం ఐసోలేషన్లో ఉంటోంది.