ఢిల్లీ: ఢిల్లీకి చెందిన అన్ని యూనివర్సిటీల పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వార్షిక పరీక్షలు, ఇతర పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఆయా విశ్వవిద్యాలయాలు తమ నిబంధనల ప్రకారం విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తారని. లేదా వారికి డిగ్రీ పట్టా అందజేస్తారని చెప్పారు.
- July 11, 2020
- Archive
- జాతీయం
- DELHI
- EXAMS
- GOVERNMENT
- MANISH SIPODIA
- పరీక్షలు
- రద్దు
- Comments Off on ఢిల్లీలో అన్ని పరీక్షలు రద్దు