Breaking News

డేరింగ్​ బ్యూటీకి ఫుల్​ సెక్యూరిటీ

ముంబై: వివాదాస్పద బాలీవుడ్​ బ్యూటీ కంగనా రనౌత్​కు కేంద్రప్రభుత్వం ‘వై ప్లస్​’ సెక్యూరిటీ కల్పించింది. బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతిచెందిన అనంతరం కంగనా రనౌత్​ వరసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ముంబై చిత్రపరిశ్రమలోని డ్రగ్స్​ వాడకంపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం ఆమెకు భద్రత కల్పించింది. వై ప్లస్​ భద్రతతో ఆమెకు 11 మంది సీఆర్పీఎఫ్​ కమెండోలు ఆమెకు రక్షణగా నిలువనున్నారు.

ఇటీవల కంగనా మహారాష్ట్ర పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ముంబై ప్రస్తుతం పాక్​ ఆక్రమిత కశ్మీర్​లా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శివసేన ఎంపీ ఆమెపై ఫైర్​ అయ్యారు. కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వబోమని వ్యాఖ్యానించారు. దీనికి కంగనా కూడా కౌంటర్​ ఇచ్చారు. సెప్టెంబర్​ 9న తాను ముంబై వస్తానని ఏం చేస్తారో చేసుకోండి అంటూ ట్వీట్​ చేశారు. కాగా తాజాగా కంగనాకు కేంద్రం సెక్యూరిటీని పెంచింది. కాగా తనకు రక్షణ కల్పించిన అమిత్​ షాకు కంగనా ధన్యవాదాలు తెలిపారు. అమిత్​ షాకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.