Breaking News

డిఫరెంట్ పాత్రలో రెజీనా

డిఫరెంట్ పాత్రలో రెజీనా

‘ఎవరు’ సినిమాతో రెజీనా కసాండ్రాలోని బోల్డ్ నెస్ ఒక్కసారిగా బయటపడింది. అది ‘నక్షత్రం’, మిస్టర్ చంద్రమౌళి’ సినిమాల్లో మరింత రెచ్చిపోయింది. చెన్నైలో పుట్టి పెరిగి సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట తమిళంలో ‘కన్డనాల్ ముదల్’ సినిమాతో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. తెలుగులో ‘ఎస్ఎంఎస్’ సినిమాతో తన సినీకెరీర్ ప్రారంభించిన రెజీనా తర్వాత ‘రొటీన్ లవ్ స్టోరీ, ‘పవర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలు గుర్తింపు ఇచ్చాయి. హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్న రెజీనా బాలీవుడ్​లో సోనమ్ కపూర్ తో కలిసి ‘ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో రెజీనా లెస్బేనియన్ రోల్ చేసింది. అక్కడ ఎంత బోల్డ్ గా నటిస్తే అంత పేరొస్తోంది కాబట్టి మరింత గ్లామర్ పండించిందట రెజీనా. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కు గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తుందట. మరి ఈ క్యారెక్టర్​తో రెజీనా పాన్ ఇండియా స్టార్ అయిపోనుందేమో అని ఇండస్ట్రీ టాక్.