సారథి న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్19 వార్డు సెంటర్ను సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్, నీటి పారుదలశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. పీపీఈ కిట్లు ధరించి వార్డు కలియతిరిగారు. కరోనా వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు. ‘ఇక్కడ సౌలత్లు బాగున్నయా?, ట్రీట్మెంట్ మంచిగ అందుతుందా..? మందులు బాగా పనిచేస్తున్నయా?’ స్థానికంగా అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మంచి వైద్యం అందిస్తున్నామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో కరోనా స్థితిగతులు, వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- August 25, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- ERRABELLI
- ETALA RAJENDAR
- MAHABUBABAD
- కరోనా పాజిటివ్
- కోవిడ్
- మహబూబాబాద్
- Comments Off on ట్రీట్మెంట్ ఎట్లుంది.. సౌలత్లు ఎట్లున్నయ్