Breaking News

టోక్యో ఒలింపిక్స్.. సాదాసీదాగానే

టోక్యో: నాలుగేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చాలా అట్టహాసంగా నిర్వహిస్తారు. తమ స్థాయి, పరపతి, ప్రతిష్టను ఇతర దేశాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా భారీమొత్తంలో ఖర్చుచేస్తారు. కానీ టోక్యో ఒలింపిక్స్ ఇందుకు అతీతం కానుంది. కరోనా దెబ్బకు ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడడంతో ఇప్పటికే ఖర్చు తడిసి మోపడవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించాలంటే మరింత ఖర్చు చేయాల్సిన పని. అందుకే టోక్యో ఒలింపిక్స్​న సాదాసీదాగా నిర్వహించాలని జపాన్ భావిస్తోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది. దాదాపు 200 అంశాలపై నిర్వాహకులు దృష్టి పెట్టారు. వీలైనంతగా ఖర్చును తగ్గించి, ప్రజారోగ్యంపై ఎక్కువగా దృష్టి సారించాలని భావిస్తోంది.