Breaking News

టీ20 ప్రపంచకప్​పై తేలుస్తాం

న్యూఢిల్లీ: అందరూ ఎదురుచూసినట్లుగా టీ20 ప్రపంచకప్​పై ఐసీసీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. వేచి చూసే ధోరణీలోనే మరోసారి ముందుకెళ్లింది. టోర్నీ భవిష్యత్​ ను వచ్చే నెలలో తెలుస్తామని బోర్డు సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సభ్యులకు సూచించింది. ‘కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి, నియంత్రణ ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సభ్య దేశాల నుంచి సమాచారం సేకరిస్తున్నాం.

క్రికెట్‌ ప్రగతి, బోర్డు మెంబర్స్‌, ఫ్యాన్స్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం కోసం నెల రోజులు ఆగుదామని డిసైడ్‌ అయ్యాం. అప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఏం చేయాలనే దానిపై చర్చిస్తాం. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి’ సీఈవో మనూ సావ్నే పేర్కొన్నారు. భారత్​లో జరిగే మెగా ఈవెంట్స్​కు సంబంధించిన పన్ను మినహాయింపుకు తుది గడవును డిసెంబర్ వరకు పెంచింది. ఆలోగా తమ ప్రభుత్వాలతో మాట్లాడి తగిన పరిష్కారంతో రావాలని చెప్పింది.