Breaking News

టీకా ఇప్పట్లో రాదు.. ట్రంప్​వి అబద్ధాలు

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై.. కమలా హారిస్​ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్​ తరఫున కమల ఉపాధ్యక్ష పదవికి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్​ విషయంలో ట్రంప్​ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పిన తేదీకి వ్యాక్సిన్​ వచ్చినా.. దాని సేఫ్టీ విషయాన్ని నమ్మలేమన్నారు. మరోవైపు కరోనా కట్టడిలో ట్రంప్​ ఘోరంగా ఫెయిల్​ అయ్యారని డెమోక్రాట్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నవంబర్​ 1నాటికి వ్యాక్సిన్​ తీసుకొస్తామని.. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే వైట్​హౌస్​ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కమలా హారిస్​ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లను మభ్యపెట్టేందుకే ట్రంప్​ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.