సారథిన్యూస్, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు డేరంగుల నర్సింహపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. పొల్కంపల్లి గ్రామంలోని ఓ భూవివాదం గురించి మాట్లాడటానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత నర్సింహపై.. సీపీఎం కార్యకర్తలు విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ దాడిలో నర్సింహ గాయపడగా అతడిని ఇబ్రహీంపట్నంలోని ఓ దవాఖానకు తరలించి చికిత్సనందిస్తున్నారు. టీఆర్ఎస్ నేతపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీటీసీలు రవీందర్, శ్రీశైలం, కో ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫ్, మంఖాల దాసు, టీఆర్ఎస్ నేతలు నిరంజన్‌రెడ్డి, మంఖాల దాసు, గుండ్ల దానయ్య గౌడ్ తదితరులు పేర్కొన్నారు.
- June 20, 2020
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- ATTACK
- HYDERABAD
- TRSLEADER
- టీఆర్ఎస్
- సీపీఎం
- Comments Off on టీఆర్ఎస్ నేతపై దాడి