Breaking News

టీఆర్​ఎస్​లో చేరిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి

టీఆర్​ఎస్​లో చేరిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి

సారథి న్యూస్, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీచేసిన ముద్దుల నాగేశ్వర్ రెడ్డి సోమవారం మంత్రి టి.హరీశ్​రావు సమక్షంలో తెలంగాణ భవన్​లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో పోటీచేసి రెండవ స్థానంలో నిలిచారు. ఆయన వెంట పెద్దసంఖ్యలో టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. ‘ఫార్మాసిటీని అడ్డుకుంటామని భట్టి మాట్లాడుతున్నారు.. ఫార్మాసిటీ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఎదురుచూస్తోంది. మొన్నటి దాకా కాళేశ్వరం అడ్డుకుంటామని చెప్పారు. కేసులు వేశారు. కాంగ్రెస్ కనీసం ప్రజలకు తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. మేం ఇంటింటికి నీళ్లు ఇస్తామంటే హడ్కోకు రుణం ఇవ్వొద్దని లేఖ రాశారు. ఏది చేస్తామన్న వద్దంటున్న కాంగ్రెస్ ను ప్రజలు వద్దంటున్నారు. నీ హుజూర్ సీటునే గెలిపించుకోలేని ఉత్తమ్ దుబ్బాకలో గెలిపిస్తావా? హుజూర్ నగర్ లో నిజామాబాద్ లో జరిగిందే దుబ్బాకలో జరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు.. మీ పార్టీ నేతలు ఎందుకు పార్టీ వీడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. దుబ్బాకలో కాంగ్రెస్ ఖాళీ అయింది. ఇక్కడ 78వేల మంది రైతులకు రైతుబంధు వస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు మైక్ ల ముందే టైగర్లు. డబ్బాలు విప్పితే ఎల్లెలుకల పడుతరు.’ అని అన్నారు. కార్యక్రమంలో మెదక్​ఎంపీ ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.