అహ్మదాబాద్: జాబ్ ఇస్తానంటూ ఫ్యాక్టరీకి పిలిపించిన ఓ పారిశ్రామిక వేత వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. అహ్మదాబాద్‌లోని అమ్రాయివాడికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల కరోనా ఎఫెక్ట్‌తో అతడి ఉద్యోగం పోయింది. దీంతో ఆ కుటంబం తీవ్ర ఆర్థికసమస్యల్లో కూరుకుపోయింది.
దీంతో సదరు యువతి.. తనకు ఏదన్నా ఉద్యోగం ఇప్పించాలని తన ఇంటి పక్కన ఉండే తన సోదరుడు స్నేహితుడిని కోరింది. అయితే అతడు తన అంకుల్‌కు ఓ ఫ్యాక్టరీ ఉందని అందులో నీకు ఏదన్నా ఉద్యోగం పెట్టిస్తానని చెప్పి యువతి రెస్యూమ్‌ను ఫ్యాక్టరీ యజమానికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్యాక్టరీ యజమాని నుంచి కాల్వచ్చింది. దీంతో యువతి అక్కడికి వెళ్లగా ఫ్యాక్టరీలో ఎవరూ లేదు. సదురు యజమాని ఆమెను ఆహ్వానించి ఇంటర్వూ చేస్తానంటూ తన గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.