కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురువారం 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సూర్య అభిమానులకు వరుసగా మూడు సర్ప్రైజ్ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో తాను ఖాతాను తెరవడం, రెండోది ‘ఆకాశం నా హద్దురా’ సినిమా నుంచి కాటుక కనులే అంటూ సాగే పాట ప్రోమో విడుదల చేయడం.. మూడవది వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘వాడి వాసల్’ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ‘వాడి వాసల్’ లుక్ లో పల్లెటూరి వాడిలా కనిపిస్తున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలోని కంటెట్కు తగ్గట్టుగా గెటప్, స్టైల్ మార్చేస్తాడు సూర్య. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే తన లుక్ ను చేంజ్ చేశాడు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. సూర్య ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ చిత్రం కూడా తెలుగు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
- July 24, 2020
- Archive
- Top News
- సినిమా
- JALLIKATTU
- KOLLYWOOD
- SURYA
- కోలీవుడ్
- జల్లికట్టు
- సూర్య
- Comments Off on జల్లికట్టుకు సూర్య