సారథి న్యూస్, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మంజీరా నదికి వరద ఉదృతి సంతరించుకుంది. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ప్రధాన ఆలయ ముందు ఉన్న నదీ పాయ పరవళ్ల తొక్కుతుండడంతో మండపంలోకి నీరు చేరింది. దీంతో ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులు పూజలు చేస్తున్నారు.
- October 14, 2020
- Archive
- Top News
- మెదక్
- MANJIRA RIVER
- medak
- SANGAREDDY
- VANADURGAMMA
- మంజీరానది
- మెదక్
- వనదుర్గమ్మ
- సంగారెడ్డి
- సింగూరు
- Comments Off on జలదిగ్బంధంలో వనదుర్గమ్మ