ఢిల్లీ: విపక్షాల ఆరోపణలు, కోర్టు వ్యతిరేక తీర్పులు, అమరావతి ఉద్యమం ఇవేవీ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ప్రజలకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. భారీమెజార్టీతో అధికారం చేపట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమపథకాలను ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అనేక జీవోలను కోర్టు రద్దుచేసింది కూడా. అయినప్పటికీ ప్రజల్లో జగన్పై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే. ఈ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే మూడోస్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
- August 8, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AP
- CM
- INDIATODAY
- SURVEY
- Ysjagan
- ఏపీ సీఎం
- జగన్
- Comments Off on జగన్ పాలన బాగుంది.. తేల్చిన సర్వే