Breaking News

చైనా సైబర్‌‌ ఎటాక్స్‌

ముంబై: గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత ఐదురోజుల్లో చైనా మన దేశంలో 40,300 సైబర్‌‌ ఎటాక్స్‌ చేసేందుకు యత్నించిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ శాతం ఎటాక్స్‌ అన్నీ బ్యాంకింగ్‌, ఐటీ సెక్టార్‌‌పైనే జరిగాయని మహారాష్ట్ర సైబర్‌‌ వింగ్‌ స్పెషల్‌ ఇన్​స్పెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ యశశ్వి యాదవ్‌ అన్నారు. మహారాష్ట్ర సైబర్‌‌ వింగ్‌, స్టేట్‌ పోలీస్‌ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్‌ ప్రకారం ఎక్కువ శాతం సైబర్‌‌ ఎటాక్స్‌ అన్నీ చైనాలోని చెంగ్డూ ఏరియా నుంచి జరిగాయని తెలుస్తోంది.

‘మా వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్‌ ప్రకారం ఐదురోజుల్లో 40,300 సైబర్‌‌ ఎటాక్స్‌కు ప్రయత్నించారు’అని మశశ్వి యాదవ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఎక్కువ శాతం సర్వీసులు ఆపడం, ప్రొటోకాల్‌ హైజాక్‌ చేయడం, ఫిషింగ్‌ లాంటి సమస్యలను కల్పించారని అన్నారు. ఇంటర్​నెట్​యూజర్స్‌ అందరూ జాగ్రత్తగా ఉండాలని, రీబూస్ట్‌, ఫైర్‌‌వాల్స్‌ క్రియేట్‌ చేసుకోవాలని సూచించారు. సైబర్‌‌ సెక్యూరిటీ ఆడిట్స్‌ కండక్ట్‌ చేయాలని ఐజీపీ చెప్పారు.