Breaking News

చెరువులు నింపాలి

చెరువులు నింపాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కాల్వల్లో నీరు చేరుతోందని, వాటితో అన్ని చెరువులను నింపాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. స్థానిక ఆర్అండ్​బీ బంగ్లాలో తనను కలిసిన వంశధార, జల వనరులశాఖ ఇంజనీర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్​లో శివారు కాల్వకు నీటిని అందించడంలో లోటుపాట్లు తలెత్తాయని, ఈసారి ఖరీఫ్ సీజన్​కు ముందు నుంచే తగు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. రబీ పంటలకు అవకాశం ఉన్న చోట నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగావళి, వంశధార నదుల అనుసంధాన ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని నివేదిక కోరారు. పెండింగ్​లో ఉన్న పనుల వివరాలు, నిధుల కొరతతో ఆగిపోయిన పనులు, రానున్న రెండేళ్లలో చేయాల్సిన పనులను నివేదిక రూపంలో తనకు అందజేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రెవెన్యూ మంత్రిని కలిసిన వారిలో వంశధార ఎస్ఈ డోల తిరుమలరావు, జలవనరుల శాఖ ఎస్ఈ ఎస్ వీ రమణ, ఈఈ శ్రీనివాస్, పలువురు డీఈ లు ఉన్నారు.