సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన అరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌ను మంగళవారం డీపీడీఎఫ్( డెమొక్రటిక్ ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చంద్రశేఖర్‌గౌడ్ గతంలో డీపీడీఎఫ్ గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో వ్యవసాయమార్కెట్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ కొత్తగంగారెడ్డి, డీపీడీఎఫ్ నాయకులు మాచర్ల మహేశ్, ఉపాధ్యక్షుడు గోవులకొండ అనిల్, కోశాధికారి రమేశ్, సభ్యులు మహేందర్, కరీం, వరప్రసాద్, శివ, శ్రీనివాస్, రాంప్రసాద్, కనకయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
- August 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHAIRMEN
- HYDERABAD
- KARIMNAGAR
- MARKETCOMITEE
- TELANGANA
- కరీంనగర్
- చైర్మన్
- చొప్పదండి
- మార్కెట్‌కమిటీ
- Comments Off on చంద్రశేఖర్‌గౌడ్‌కు సన్మానం