అమరావతి: కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తేల్చిచెప్పింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావించిన టీడీపీకి ప్రస్తుత బీజేపీ నిర్ణయంతో ఆశలు అడుగంటాయి. రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని పీవీ కృష్ణయ్య అనే వ్యక్తి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపింది. దీంతో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని దీనితో కేంద్రానికి ఏ విధమైన సంబంధం లేదని కేంద్రం ఫిడవిట్లో స్పష్టం చేసింది.
- August 6, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- AP
- CENTRAL
- Jagan
- చంద్రబాబు
- బీజేపీ
- Comments Off on చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి