సారథిన్యూస్, రామగుండం: బషీర్బాగ్లో అప్పటి సీఎం చంద్రబాబు సృష్టించిన మారణకాండ తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వామపక్షాల నేతలు బషీర్బాగ్ అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని తెలుగుజాతి ఎప్పటికి క్షమించబోదని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ ధర్నాచేసిన అమాయకరైతులను, వామపక్ష ఉద్యమకారులను చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా పొట్టనపెట్టుకున్నదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు గౌతం గోవర్ధన్, వై యాకయ్య, కే రాజన్న, కె కనకరాజ్, మద్దెల దినేష్, మడ్డి ఎల్లయ్య, ఎల్ ప్రకాష్, రాజారత్నం, రెనికుంట్ల ప్రీతమ్, నాగమణి, ఇదునూరి నరేశ్, తొకల రమేష్ దుర్గయ్య, ఎల్ ప్రకాశ్, కే రాజరత్నం, ఎంఎ గౌస్ శనిగరపు చంద్రశేఖర్, ఈర్ల రామచంద్ర ఇనుముల రాజమౌళి, కుమారస్వామి, లింగయ్య, జనగామ మల్లేష్, ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
- August 28, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BASHEERBAGH
- CHANDRABABU
- CM
- HYDERABAD
- KARIMNAGAR
- ఆంధ్రప్రదేశ్
- చంద్రబాబునాయుడు
- బషీర్బాగ్కాల్పులు
- సీఎం
- Comments Off on చంద్రబాబును తెలుగుజాతి క్షమించదు