సారథి న్యూస్, హైదరాబాద్: గోల్డ్రేటు పైపైకి పెరుగుతోంది.. సామాన్యులకు అందుకుండా దూసుకెళ్తోంది.. బుధవారం 10 గ్రాముల ధర రూ.48,420 వద్ద కొత్త గరిష్ట ధరను నమోదు చేసింది. 22 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములకు రూ.46,800 కాగా, 24 క్యారెట్ల రిటైల్ ధర రూ.48వేలు పలుకుతోంది. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గి కిలో ధర రూ.48,716 వద్ద ఆగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతమవుతుండడంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని ఊహాగానాల నేపథ్యంలో లోహాలకు డిమాండ్ పెరిగింది. సంక్షోభ కాలంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి ఈక్విటీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండటంతో రేట్లు ఎగబాకుతున్నాయి.
- June 24, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- GOLD RATE
- HYDERABAD
- బంగారం ధరలు
- వెండి
- Comments Off on గోల్డ్ రేటు జిగేల్