న్యూఢిల్లీ: వివాదాస్పద స్వామీజీ గోల్డెన్ బాబా బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్నారు. హరిద్వార్‌కు చెందిన గోల్డెన్ బాబాపై కిడ్నాప్, దోపిడీ, హత్యాబెదిరింపు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్‌లో ఉంటున్నారు. బాబా స్వస్థలం ఘజియాబాద్. బాబా అవతారం ఎత్తడానికి ముందు ఆయన ఢిల్లీలో వస్త్రవ్యాపారం చేసేవాడు. అనంతరం సన్యాసం స్వీకరించి ఢిల్లీలో 1972లో ఆశ్రమం ఏర్పాటు చేశాడు. భారీగా బంగారం ధరించడంతో అతడికి గోల్దెన్బాబా అనే పేరు వచ్చింది. ఆయన బంగారాన్ని దైవంగా ప్రచారం చేసేవాడు. అతడికి రక్షణగా నిత్యం 30 మంది బాడీగార్డులు ఉండేవారు.
- July 1, 2020
- Archive
- జాతీయం
- CASE
- DELHI
- GOLDENBABA
- KIDNAP
- MACCAR
- SUDHEER
- అధ్యాత్మికవేత్త
- Comments Off on గోల్డెన్‌బాబా ఇకలేరు