సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండడంతో స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. చదువుతున్న స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్‌కు ‘జ్ఞానదీక్ష’పేరుతో ‘దూరదర్శన్–యాదగిరి’ చానెల్ద్వారా ఆన్లైన్ పాఠాలు చెప్పనున్నారు. ప్రతిరోజు అరగంట పాటు(30 నిమిషాలు) మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు పాఠాలు ప్రసారం చేయనున్నారు.
జులై 6 నుంచి 18వ తేదీ వరకు డిగ్రీ విద్యార్థులకు, జులై 21 నుంచి 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్విద్యార్థులకు, ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్కూలు స్థాయి విద్యార్థులకు పాఠాలు చెబుతారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, సోషల్ స్టడీస్, మ్యూజిక్ వంటి సబ్జెక్టుల్లో ఎంపికచేసిన అంశాలు, కాన్సెప్టుల వారీగా నిపుణులైన టీచర్లు, లెక్చరర్లు బోధించనున్నారు. కరోనా సమయంలో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా లెసన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. పేరెంట్స్తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.