సారథి న్యూస్, మచిలీపట్నం : మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో పోలీసులు భారీ గుట్కా ప్యాకెట్ల డంపును శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో గుట్కా డంపు నిల్వ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా రూ.20లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. లెనిన్ అనే వ్యక్తి మున్సిపల్ పార్కు కాంప్లెక్స్ శ్రీ మహాలక్ష్మి జనరల్ స్టోర్స్ నిర్వహిస్తూ పక్కనే ఉన్న దుకాణం అద్దెకు తీసుకుని నిషేదిత గుట్కాలు, ఖైనీలతో గోదాము నిర్వహిస్తున్నాడని విశ్వసనీయ సమాచారంతో ఏఎస్పీ జిందాల్, డీఎస్పీ మెహబూబ్ బాషా, సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిషేదిత గుట్కా, ఖైనీ గోడౌన్ పై దాడి చేశామన్నారు. నిందితుడు లెనిన్ అదుపులో ఉన్నట్లు.. గతంలో కూడా లెనిన్ పైన నిషేధిత గుట్కా, ఖైనీ కేసులు పెట్టినా మార్పు రాలేదన్నారు. అలాగే కొంత కాలం క్రితం గుట్కాలు , ఖైనీలు వ్యాపారం చేస్తున్నాడని గెల్లి కిషోర్ అనే వ్యక్తిని కలెక్టర్ నగర బహిష్కరణ చేసినట్లు గుర్తుచేశారు.
- July 25, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- లోకల్ న్యూస్
- DUMP
- GUTKA
- POLICE
- గుట్కా
- డంపు
- పోలీస్
- Comments Off on గుట్కా డంపు స్వాధీనం