Breaking News

మెగాస్టార్​.. గుండు గుట్టు బయటపడింది

నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ బ్లాక్ గాగుల్స్, గుండుతో ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ పెద్ద సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన చిరంజీవి ఈ గెటప్ తో ఏ సినిమా చేయనున్నారో అన్న క్యూరియాసిటీని కలిగించారు. కానీ చిరు ప్రస్తుతం కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఆ మూవీకి అయితే ఈ లుక్ అవసరం లేదు కానీ తర్వాత మెహర్ డైరెక్షన్​లో ‘వేదాళం’ రీమేక్ కోసం కమిటైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కోసమే ఈ లుక్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా ఆ ఫొటోకు మాత్రం అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే చిరు ఈ ఫొటో కోసం నిజంగా గుండు చేయించుకున్నారా? అన్న డౌట్ కు క్లారిటీ వచ్చింది.

తనను అలా ఎవరు చేశారో కూడా చిరు ఇప్పుడు రివీల్ చేసేశారు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీనే ఉపయోగించి చిరు ఈ లుక్ ను రెడీ చేశారు. ఒక స్పెషల్ మేకప్ టీం తో తన హెయిర్ పైనే స్పెషల్ మేకప్ ద్వారా ఆ అర్బన్ మాంక్ లుక్ లోకి మారిపోయారు. తనకి ఇలా మేకప్ చేసిన టీం కు చిరు థాంక్స్ చెప్పడమే కాకుండా సినిమా మ్యాజిక్ కు సెల్యూట్ చేశారు. దీంతో చిరు రేపిన సస్పెన్స్ కు తెర అయితే పడింది కానీ ఈ లుక్ ను వేదాళం రీమేక్ కోసమేనా? అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.